- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్క్ దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి
షార్క్ చేప దాడిలో 12 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: షార్క్ చేప దాడిలో 12 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది. దేశంలో తూర్పు తీరంలో వరుసగా షార్క్ దాడులు జరుగుతున్న క్రమంలో.. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత ఆదివారం నికో ఆంటిక్ (12) తన ఫ్రెండ్స్ తో కలిసి సిడ్నీకి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాక్లూస్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ రాళ్ల పై నుంచి నీటిలోకి దూకగా.. షార్క్ దాడి చేసింది. వెంటనే నికో ఫ్రెండ్స్ అతన్ని నీటిలో నుంచి బయటకు లాగి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. నికో రెండు కాళ్లకు తీవ్రంగా గాయలవ్వగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ సందర్భంగా నికో కుటుంబ సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో.. “మా కుమారుడు నికో ఇక లేడని చెప్పాల్సి రావడం మా హృదయాలను విరిచేసింది. అతడు ఎంతో ఆనందంగా, స్నేహపూర్వకంగా, స్పోర్ట్స్ అంటే ఇష్టంగా ఉండేవాడు. అతన్ని ఎప్పటికీ గుర్తు మరచిపోలేం” అని తెలిపారు.
ఇటీవల భారీ వర్షాల కారణంగా సముద్ర జలాలు మసకబారడంతో షార్క్‌లు తీరానికి చేరువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత రెండు రోజుల్లో నాలుగు షార్క్ దాడులు జరగడంతో సిడ్నీ సహా పలు తీరప్రాంతాల్లో డజన్ల కొద్దీ బీచ్‌లను అధికారులు మూసివేశారు. గత సెప్టెంబర్‌లో కూడా సిడ్నీలోని లాంగ్ రీఫ్ బీచ్ వద్ద ఒక సర్ఫర్ భారీ షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. పలు సంస్థల గణాంకాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో సగటున ఏడాదికి సుమారు 20 షార్క్ దాడులు జరుగుతుంటాయి. అయితే వీటిలో మృతికి దారితీసేవి మూడు కంటే తక్కువే. ఈ సంఖ్యలు బీచ్‌లలో మునిగిపోవడం వల్ల జరిగే మరణాల కంటే చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.






