ఆయా పాడుపని.. బాత్రూమ్ లో బాలుడిపై అరాచకం.. సిగరెట్ పీకతో అక్కడ కాల్చి

347

దిశ, వెబ్‌డెస్క్: ఆమె ఒక ఆయా.. రోజు స్కూల్ కి వచ్చే విద్యార్థుల యోగక్షేమాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. టీచర్లతో చనువుగా ఉండని విదార్థులు ఆమెతో చనువుగా తిరిగేవారు. కానీ, ఆమె మాత్రం సొంతబిడ్డలుగా చూసుకోవాల్సిన చిన్నారులను కామ కోరికలు తీర్చుకోవడానికి వాడుకొంది.  స్కూల్‌లో విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆమె.. చాలా నీచంగా ప్రవర్తించింది. బాత్‌రూమ్‌లో 8 ఏళ్ల బాలుడిపై లైంగికంగా వేధించింది. 2017లో హైదరాబాద్‌ నగరంలో ఎనిమిదేళ్ల బాలుడిపై ఆయా అత్యాచారయత్నం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమెకు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

వివరాలలోకి వెళితే.. బార్కస్‌లోని ఓ స్కూల్‌లో 2017లో జ్యోతి అలియాస్‌ మంజుల ఆయాగా చేరింది. అక్కడ విద్యార్థులను మంచిగా చూసుకొంటూనే వారిపై లైంగిక దాడికి యత్నించేది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడింది. బాలుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లగా.. అతడి వెనకాలే వెళ్లి లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పవద్దంటూ బాలుడిని హింసించింది.

స్నేహితులకు కానీ, ఇంట్లో కానీ విషయం చెప్పకూడదని బెదిరిస్తూ పిల్లాడి చేతిపై సిగరెట్ పీకతో కాల్చింది. ఇక ఆ గాయాలు చూసిన తల్లిదండ్రులు బాలుడిని నిలదీయగా అసలు విషయం బయటికొచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఇందుకు సంబంధించి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  పోక్సో కేసులు విచారించే ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో విచారణ చేపట్టిన న్యాయమూర్తి  జ్యోతి నేరం రుజువు కావడంతో.. ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే రూ. 10 వేల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించారు.

ఇవి కూడా చదవండి:

చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాదీల కన్ను.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన 16 మంది

తల్లీకూతురితో కానిస్టేబుల్ రాసలీలలు.. నగ్నంగా బెడ్ పై అడ్డంగా దొరికి

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..