AP Politics: ఎచ్చర్లలో అసమ్మతిని అధిగమించేదెలా?

by Disha Web Desk 3 |
AP Politics: ఎచ్చర్లలో అసమ్మతిని అధిగమించేదెలా?
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో వ్యతిరేకతను అధిగమించేందుకు వైసీపీకి సతమతమౌతోంది. అసమ్మతి, హత్యారాజకీయాలు, గ్రూపుగోడవలువంటి వాటి కారణంగా ప్రస్తుత శాసనసభ్యుడు గొర్లె కిరణ్‌కు అసలు టికెట్టే రాదని తొలుత అంతా భావించారు. అనూహ్యంగా వైసీపీ అధిష్టానం ఆయన పేరే ఖరారు చేసింది. కూటమి అభ్యర్దిగా బీజేపీకి చెందిన నడుకుదుటి ఈశ్వరరావు బరిలోకి దిగడంతో తొలుత పెద్ద పోటీ ఏమీ కాదని తేలిగ్గా తీసుకొన్నారు.

అయితే, ఇప్పుడు బీజేపీ అభ్యర్ది బాగా బలపడడం, తెలుగుదేశం, జనసేనల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండడం వైసీపీకి చెమటలు పట్టిస్తోంది. భారీగా నామినేషన్ వేయడం ద్వారా బీజేపీ అభ్యర్ధి ఈశ్వరరావు సత్తా చాటారు.

వ్యతిరేకత, హత్యారాజకీయాలతో చెడ్డపేరు

ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌‌ని అధికారపార్టీకి చెందిన ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. కిరణ్ నాయకత్వానికి గత రెండేళ్లుగా తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్న రెబల్ నేతలు, రానున్న ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దని పట్టుబట్టారు. ఒక దశలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్ నేతలు రోడ్డేక్కి పోయారు.

నాలుగు నెలల క్రితం జగన్ సొంత పత్రిక అయిన సాక్షీ రిపోర్టర్ దామోదర ఆత్మహాత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ నోటులో కూడ ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ మానసీక ఒత్తిడిన భరించలేక చనిపోతున్నానని రాశారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి రౌడీజీయం ఆపార్టీకి మాయని మచ్చగా నిలిచింది. వైసీపీ సీనియర్ నాయకుడు ఎచ్చెర్ల మండల మాజీ ప్రెసిడెంట్ జరుగుల శంకర్‌పై మూడు నెలల క్రితం హత్యయత్నం జరిగింది. ఈ రెండు ఇప్పుడు ఎమ్మెల్యే కిరణ్‌కు మైనస్‌గా మారాయి. చిరంజీవిని ఆ తరువాత పార్టీనుంచి సస్పెండ్ చేసిన జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

టిటీపీ నుంచి సంపూర్ణమద్దతు

టీడీపీకి చెందిన మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నుంచి బరిలో ఉండడంతో ఆయన మద్దతుదారులు, అనుచరులు ఈశ్వరరావుకు పూర్తిగా సహకరిస్తున్నారు. తెలుగుదేశంలో మరో గ్రూపు నేత అయిన కలిశెట్టి అప్పల నాయుడు విజయనగరం ఎంపీగా బరిలో వుండడంతో స్వంత నియోజక వర్గమైన ఎచ్చర్లలో సత్తా చాటేందుకు ఆయన వర్గీయులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఈశ్వరరావుకు బాగా కలసివస్తున్నాయి. స్వతగాహా విద్యావేత్త కావడం, నియోజక వర్గంలోనే విద్యాసంస్దలు వుండడం ఈశ్వరరావుకు అనుకూలంగా మారింది.

Read More..

ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు



Next Story

Most Viewed