లోక్​సభ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారులు

by Disha Web Desk 15 |
లోక్​సభ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారులు
X

దిశ, ఖమ్మం రూరల్ : రూరల్ మండలం పొన్నెకల్లు పరిధిలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్​ తోపాటు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంయుక్తంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని బ్లాకుల గదులను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లకు గాను గదుల విస్తీర్ణాన్ని పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఈవీఎం లు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు పరిశీలించారు. భద్రతా తదితర అన్ని చర్యలు పకడ్బందీగా ఉండేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, యువరాజ్, ట్రైనీ ఏఎస్పీ మౌనిక, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్ది, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed