- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లౌజ్‌కు బదులు మెహెందీ వేసుకున్న మహిళ.. నెట్టింట వైరల్
<p>దిశ, ఫీచర్స్: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ వేడుకల్లో జ్యువెలరీ, వస్త్రధారణతో పాటు శరీర సౌందర్యానికి అతివలు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసిందే. ఈ క్రమంలో మెహెందీ డిజైన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇంతకుముందు ఈ ఆచారం చేతులు, కాళ్లకే పరిమితం కాగా.. ఇప్పుడు మెహెందీ బ్లౌజ్‌గానూ కనిపించి కొత్త ట్రెండ్‌కు దారితీసింది. తాజాగా ఒక మహిళ తన చీరతో హెన్నా(మెహందీ) బ్లౌజ్‌ను ధరించినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ బోల్డ్ […]</p>

దిశ, ఫీచర్స్: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ వేడుకల్లో జ్యువెలరీ, వస్త్రధారణతో పాటు శరీర సౌందర్యానికి అతివలు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసిందే. ఈ క్రమంలో మెహెందీ డిజైన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇంతకుముందు ఈ ఆచారం చేతులు, కాళ్లకే పరిమితం కాగా.. ఇప్పుడు మెహెందీ బ్లౌజ్‌గానూ కనిపించి కొత్త ట్రెండ్‌కు దారితీసింది. తాజాగా ఒక మహిళ తన చీరతో హెన్నా(మెహందీ) బ్లౌజ్‌ను ధరించినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ బోల్డ్ అటెంప్ట్ త్వరలోనే ఫ్యాషన్ ట్రెండ్‌గా మారే అవకాశం లేకపోలేదు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు షేర్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మహిళ బోల్డ్ లుక్‌పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో ఇలాంటి పనులు చేసేందుకు సిగ్గుండాలి! అని కామెంట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో మహిళ తన శరీరంపై బ్లౌజ్ స్థానంలో హెన్నా డిజైన్‌గా వేయించుకుంది. సంప్రదాయ బ్లౌజ్‌ను ధరించడం విస్మరించి, అందుకు బదులుగా ముందు, వెనుక భాగంలో కేవలం హెన్నా డిజైన్‌తోనే దర్శనమిచ్చింది. అయితే ఇది డిజైనర్ బ్లౌజ్ వలె కనిపిస్తుండం విశేషం.






