గొంతు నొప్పితో ఆసుపత్రికి వెళితే.. ప్రాణాలు తీసిన వైద్యులు..!

by Batti.Sumithra |

<p>దిశ, షాద్‌నగర్: వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నందిగామ మండలం దేవుడి మామిడిపల్లికి చెందిన పద్మ (32) అనే మహిళకు గొంతునొప్పిగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువస్తే మధ్యాహ్నం మహిళ మృతి చెందింది. గొంతునొప్పితో వస్తే చివరకు ప్రాణాలు తీసారంటూ కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు [&hellip;]</p>

గొంతు నొప్పితో ఆసుపత్రికి వెళితే.. ప్రాణాలు తీసిన వైద్యులు..!
X

దిశ, షాద్‌నగర్: వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నందిగామ మండలం దేవుడి మామిడిపల్లికి చెందిన పద్మ (32) అనే మహిళకు గొంతునొప్పిగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువస్తే మధ్యాహ్నం మహిళ మృతి చెందింది. గొంతునొప్పితో వస్తే చివరకు ప్రాణాలు తీసారంటూ కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న దాఖలాలు ఉన్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story