సన్నాలకు సున్నమే..

by  |
సన్నాలకు సున్నమే..
X

తెలంగాణ పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారింది. రైతును రాజును చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా వానాకాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే.. మంచి మద్దతు ధరను పొందగలమంటూ సీఎం కేసీఆర్ రైతులకు హామీనిచ్చారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ నియంత్రిత పంటలను సాగు చేయాలని చెప్పడంతో రైతులంతా అదే పనిచేశారు. అదే మాటను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఢంకా బజాయించి చెప్పింది. అందులో భాగంగానే దొడ్డు రకం, సన్న రకాలను 60:40 నిష్పత్తిలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సాగు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నియంత్రిత పంటల సాగులో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే.. దొడ్డు రకం వరి పంట సాగుతో పోల్చితే.. సన్నరకం వరి పంటకు పెట్టు బడి అధికం. దిగుబడి సైతం దొడ్డు రకం వరి ధాన్యం కంటే తక్కువగానే వస్తోంది. అయితే సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ఇటు ప్రభుత్వం.. అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. చివరకు సన్న రకం ధాన్యం కొనేందుకు సైతం మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.

దిశ ప్రతినిధి, నల్లగొండ:

ప్రభుత్వ పిలుపుతో పెరిగిన 80వేల ఎకరాలు..

రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో ఈ వానాకాలం సీజనులో సన్నరకం వరి రకాన్ని అన్నదాతలు అధికంగా సాగు చేశా రు. గత వానాకాలం సీజనులో ఒక్క నల్లగొండ జిల్లాలో 3.23 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇం దులో 1.55 లక్షల ఎకరాల్లో సన్నరకం, 1.68 లక్షల ఎక రాల్లో దొడ్డు రకం వరిని సాగు చేశారు. అయితే నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో సన్నరకం వరినే అ ధికంగా సాగు చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చి న పిలుపు మేరకు ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ సన్నాలకు రైతులు సాగు చేశారు. దీంతో ఒక్క నల్లగొండ జిల్లాలోనే సన్నాల సాగు 80 వేల ఎకరాలకు పైగా పెరిగింది. అంటే నల్లగొండ జిల్లాలో సన్న రకాల సాగు విస్తీర్ణం 2.32 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇదిలావుంటే.. నల్లగొండ జిల్లాలో వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎక రాలు కాగా, ఈ సీజనులో 4,00,968 ఎకరాల్లో వరి పం టను సాగు చేశారు. అందులో శాతం సన్నరకాలను సాగు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులు డిమాండ్ అధికంగా ఉన్న తెలంగాణ సోనా, సాంబమసూరి (బీపీటీ), హెచ్ఎంటీ సోనా రకాలకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో వాటినే సాగు చేశారు.

మార్కెట్‌లో తగ్గిన డిమాండ్..

గతంలో రైతులు సన్నాలు తక్కువగా సాగు చేసేవారు. దీంతో సన్నాలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ప్రభుత్వ ని యంత్రిత పంటల సాగు విధానంలో సన్నరకాలను ఈ సారి రైతులు ఎక్కువగా సాగు చేశారు. దీంతో మార్కెట్‌లో దొడ్డు రకాలతో పోల్చితే.. సన్నాలకు డిమాండ్ ఒక విధంగా తగ్గింది. ఎందుకుంటే.. గతంలో బియ్యం వ్యాపారులు, మిల్ల ర్లు.. నేరుగా రైతుల నుంచి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యంగా మార్చి అమ్మేవారు. దాంతో గతంలో ఎ టూ లేదన్న క్వింటాల్ సన్నరకం వడ్లకు రూ.1900 నుంచి రూ.2వేల వరకు పలికేది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఆ ప రిస్థితి తారుమరయ్యింది. సన్నరకాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో మిల్లర్లు బియ్యం అమ్మకాల కోసం రైతుల వద్ద నుంచి నేరుగా సన్నరకాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సన్నాలు ఎక్కువగా ఉండడంతో మిల్లర్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అక్కడో ఇక్కడో మిల్లర్లు కొనుగోలు చేసేందుకు ముం దుకొచ్చినా.. దొడ్డు రకం ధరకు మించి పెట్టడం లేదు. ఒకవేళ మిల్లర్లకు అమ్మకుండా రైతులే స్వయంగా బి య్యంగా మార్చి సన్నాలకు అమ్ముకోవచ్చు. కానీ అదం తా లేట్ ప్రాసెస్. అప్పటివరకు పంటల సాగు కోసం అప్పు తెచ్చిన పెట్టుబడి మరింత భారంగా మారే అవకా శం ఉంది. దీంతో ప్రభుత్వం మాట విన్నందుకు రైతుల కేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెనుభారం..

సాధారణంగా ప్రభుత్వం ధాన్యాన్ని రెండు కేటగిరీల్లో కొను గోలు చేస్తోంది. ఒకటీ ఏ-గ్రేడ్, రెండు సాధారణ రకం ధాన్యం. వరి గింజ పొడవు గింజ అడ్డం కంటే రెండున్నర రేట్లు పొడవు ఎక్కువగా ఉంటే.. దాన్ని ఏ-గ్రేడుగా, దాని కంటే తక్కువ పొడవు ఉంటే సాధారణ రకంగా పరిగణిస్తారు. వాస్తవంగా సన్న రకం వరి పొ డవు ఎక్కువగా ఉండడం వల్ల అది ఏ-గ్రేడు కిందకు వ స్తుంది. ప్రస్తుత వానాకాలం లో పండించిన పంటకు సంబంధించి ఏ- గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరగా రూ.1,888, సాధారణ రకం ధాన్యానికి రూ.1868గా మద్దతు ధర నిర్ణయించారు. అయితే గతేడాది సన్నరకం ధాన్యాన్ని రైతులు నిక్షేపంగా క్వింటా ల్‌ను రూ.1900 నుంచి రూ.2వేల వరకు అమ్ముకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానంతో రైతులకు సన్నరకాలను సాగు చేసేలా చేసింది. ఫలితం గా రైతులు చేజేతుల్లా నష్టాలను చవిచూసేలా నిర్లక్ష్యం వ్యవహరించింది. నిజానికి ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధరను వేరుగా ప్రకటించాలి. కానీ సన్నరకం ధాన్యం పట్ల నిర్లక్ష్యమో.. మరే ఇతర కారణమో కానీ సన్నరకం మద్దతు ధర పట్ల స్పష్టతనివ్వలేదు. వాస్తవానికి రైతులు దొడ్డు రకం కాదని.. సన్నరకాలను సాగు చేయడం వల్ల సమ యంతో పాటు అధిక పెట్టుబడి, తక్కువ దిగుబడిని సాధించినట్టయ్యింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరించడం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి మిల్లర్ల షాక్..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నియంత్రిత పంటల సాగు విధానానికి మిల్లర్లు సైతం నిరాసక్తిగా ఉన్నా రు. ఏటా మిల్లర్లు.. దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగిస్తుంటా రు. అయితే అదేమాదిరిగా సన్న రకం ధాన్యం కొను గోలు చేసేందుకు మిల్లర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నారు. ఎందుకంటే.. మిల్లర్లు సన్నరకం ధాన్యం కొ నుగోలు చేసిన పక్షంలో క్వింటాల్ ధాన్యానికి 67 కి లోల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉం టుంది. అయితే సన్నరకం ధాన్యంలో 67 కిలోల బి య్యం వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో మిల్లర్లపై ఆర్థికభారం పడే అవకాశం ఉంది. ఇదీకాకుండా చాలా మంది మిల్లర్లు సన్నబియ్యం దందా ప్రధాన వనరుగా ఉంటుంది. సీజనులో సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి.. బియ్యంగా మార్చి క్వింటాల్ రైస్‌ను రూ.4 వే ల నుంచి రూ.5 వేల వరకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. దీనిపై వచ్చే ఆదాయంతోనే రైస్ మి ల్లుల నిర్వహణ ఖర్చు యాజమాన్యాలకు తప్పుతుం ది. కానీ ప్రభుత్వ నియం త్రిత పంటల సాగుతో ఆ పరిస్థితులు తారుమారవ్వడంతో ప్రభుత్వ తీరుపట్ల మిల్లర్లు సైతం అసంతృప్తిగా ఉన్నారు. ఆ క్రమంలోనే సన్నరకాలను కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు.



Next Story

Most Viewed