ఉగ్రవాదుల వేటలో ‘వైల్డ్ డాగ్’.. అదిరిపోయిన రెస్పాన్స్

by  |
Nagarjuna, wild dog
X

దిశ, సినిమా: ఫెరోషియస్, పాట్రియాటిక్, డేర్ డెవిల్ ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ వచ్చేసింది. కింగ్ నాగార్జున టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ‘ఒకడు మనదేశంలో వందలమంది అమాయకులను చంపి మీరేమీ చేయలేరు అంటే.. ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్’ లాంటి డైలాగ్స్ ఆడియన్స్‌లో ఫైర్ పెంచుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏ ఆఫీసర్‌గా నాగ్ బ్లాక్ బస్టర్ కొట్టేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ‘ఉగ్రవాది దొరికితే ఇండియన్స్ ఏం చేస్తారు.. బిర్యానీ, జెడ్ కేటగిరీ భద్రత, కుక్కల్లా కాపలా కాస్తారు’ అని టెర్రరిస్ట్ డైలాగ్ చెప్తుంటే.. ‘ఇప్పుడు కొత్తగా ఏం చేస్తామో చూపిస్తాం, వైల్డ్ డాగ్ మాదిరిగా వెంటాడి వేటాడుతం’ అన్నట్లుగా ట్రైలర్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ‘వైల్డ్ డాగ్’ డిఫరెంట్ కంటెంట్‌తో వస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సయామీ ఖేర్, ప్రకాష్ సుదర్శన్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు అహిషోర్ సోలమన్ దర్శకులు కాగా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది.



Next Story

Most Viewed