లవర్‌తో భర్త షాపింగ్.. నడిరోడ్డుపైనే చితకొట్టిన భార్య (వీడియో)

by  |
లవర్‌తో భర్త షాపింగ్.. నడిరోడ్డుపైనే చితకొట్టిన భార్య (వీడియో)
X

దిశ,వెబ్ డెస్క్:ఈ మధ్య ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాలే. బంగారంలాంటి భార్య ఇంట్లో ఉన్నా కూడా కొందరు మగాళ్లు వేరొక అమ్మాయితో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇంట్లో భార్యకు తెలియకుండా వారితో షాపింగులకు, షికార్లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అలాంటి సమయం లో భార్యకు అడ్డంగా బుక్కై వారి పరువును వారే రోడ్డుమీద పడేసుకుంటున్నారు. తాజాగా ప్రియురాలితో షాపింగ్ చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు ఒక ప్రబుద్దుడు. ఇంకేముంది తన భర్త పక్కన తన ప్లేస్ లో వేరొక అమ్మాయిని చూసిన ఆ భార్య కోపోద్రేకురాలైంది. నడిరోడ్డు, పదిమంది చూస్తున్నారని కూడా లేకుండా కోపం తీరేవరకు భర్తను చితకబాదింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటుచేసుకుంది.

మీరట్ కి చెందిన అయేషా, అద్నాన్ కి ఏడాది క్రితం వివాహమైంది. ఐతే అద్నాన్ మాత్రం వేరొక అమ్మాయి మోజులో పడి భార్యను పట్టించుకోవడం మానేసాడు. గతకొన్ని రోజులుగా భర్తకు వేరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని గ్రహించిన అయేషా అతనిని ఫాలో చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మంగళవారం అద్నాన్ ప్రియురాలితో కలిసి షాపింగ్ వెళ్ళాడు. అతనిని ఫాలో అయిన భార్య, భర్తను ప్రియురాలితో కలిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడిక్కడే అద్నాన్‌ను చితకబాదింది. ఇదే అదును గా భావించిన ప్రియురాలు అక్కడినుండి ఎస్కేప్ అయ్యింది. అనంతరం పోలీసులు అద్నాన్ ని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.



Next Story

Most Viewed