వేరే అమ్మాయిలతో నటుడి రొమాన్స్.. రోడ్డెక్కి ధర్నాకు దిగిన భార్య

254

దిశ, వెబ్ డెస్క్:  ఇటీవల బుల్లితెర నటులు ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటీకే  పలువురు టీవీ నటులు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సీరియల్ నటుడి వివాదం వార్తల్లో నిలిచింది. ‘వదినమ్మ’, ‘చంద్రలేఖ’,’మొగలిరేకులు’, ‘చక్రవాకం’, ‘రాధాకళ్యాణం’ వంటి సీరియల్స్‌లో హీరోగా, సహాయ నటుడిగా నటిస్తున్న శ్రవణ్ రాజేష్ అలియాస్ రాజేష్ నిజస్వరూపం బట్టబయలయ్యింది. ఎంతో అమాయకుడిగా కనిపించే ఈ నటుడి రాక్షసత్వాన్ని అతని భార్య ఏకరువు పెట్టింది.  భార్య కళ్లుగప్పి వేరే యువతులతో ఈ నటుడు నడిపిస్తున్న రాసలీలలను పోలీసుల ముందు బయటపెట్టింది. భార్య సాధన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు రాజేష్‌ దత్తా కు 2015, జూన్‌ 6న అరుణ అలియాస్‌ సాధనతో  విజయవాడలో చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. సాధన తల్లిదండ్రులు 15 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.

పెళ్లి తర్వాత మూడు నెలలు వారి కాపురం కలహాలు లేకుండా సాగింది. ఆ తర్వాత భార్యను తీసుకొని హైదరాబాద్  కు మకాం మార్చాడు రాజేష్. ఇక ఇక్కడినుండి రాజేష్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు పెళ్లి కాలేదని వేరే అమ్మాయిలకు చెప్పి, వారితో వివాహేతర సంబంధం పెట్టుకొనేవాడు. ఈ విషయం తెలిసి ఇందేంటని అడిగితే తనని హింసించేవాడని, చిత్ర హింసంలు పెట్టి ఇంటి నుండి గెంటేసాడని రాజేష్‌ భార్య సాధన వివరించింది. భర్త బాధలు పడలేక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని జగద్గిరి పోలీసులను ఆశ్రయించిన సాధన భర్త రాజేష్‌పై ఫిర్యాదు చేసి, భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. రాజేష్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..