- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీనా బిడ్డకు తండ్రి ఎవరు?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రైమ్ వీడియోలో ‘మీర్జాపూర్ 2’ విడుదలై ఇప్పటికే పదిహేను రోజులు దాటింది. సిరీస్ కొద్దిగా డిజప్పాయింట్ చేసినా, మీమర్లకు మాత్రం కావాల్సినంత కంటెంట్ దొరికింది. ముఖ్యంగా మున్నా భాయ్ ‘లో* లలిత్’ మీమ్ సూపర్ వైరల్ అవుతోంది. ఇక బీనా గురించి మరో మీమ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్‌లో బీనా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది ఇప్పుడు నెటిజన్లకు సమాధానం తెలియని ప్రశ్నగా మారింది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రైమ్ వీడియోలో ‘మీర్జాపూర్ 2’ విడుదలై ఇప్పటికే పదిహేను రోజులు దాటింది. సిరీస్ కొద్దిగా డిజప్పాయింట్ చేసినా, మీమర్లకు మాత్రం కావాల్సినంత కంటెంట్ దొరికింది. ముఖ్యంగా మున్నా భాయ్ ‘లో* లలిత్’ మీమ్ సూపర్ వైరల్ అవుతోంది. ఇక బీనా గురించి మరో మీమ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్‌లో బీనా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది ఇప్పుడు నెటిజన్లకు సమాధానం తెలియని ప్రశ్నగా మారింది.
ఈ బిడ్డకు తండ్రి మీరే అంటూ ఎవరికి చెప్పాల్సిన మాట వారికి బీనా చెప్పింది. దీంతో కాళీన్ భయ్యా, రాజా, భావుజీలలో ఎవరు అసలైన తండ్రి అనే విషయం గురించి ప్రేక్షకులకు స్పష్టత లేదు. ఈ విషయం గురించి సీజన్ 2 విడుదలైన దగ్గరి నుంచి ఆ నటీనటులను అడుగుతూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు బీనా పాత్ర పోషించిన రసికా దుగ్గల్ నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు స్పందించారు. ‘బిడ్డ ఎవరిదైతే ఏంటి.. బీనా బిడ్డ’ అంటూ ఆమె రిప్లయి ఇచ్చారు కానీ తండ్రెవరో మాత్రం చెప్పలేదు. ఏదేమైనా ఇది కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న రేంజ్‌లో కాకున్నా ఎంతో కొంత సందిగ్ధాన్ని మాత్రం క్రియేట్ చేస్తోందనడంలో సందేహం లేదు.






