ఫుడ్ లవర్స్ కి WHO గుడ్ న్యూస్ 

by  |
ఫుడ్ లవర్స్ కి WHO గుడ్ న్యూస్ 
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆహార పదార్ధాలను కొనేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆహరం ద్వారా, ఆహార పదార్ధాల ప్యాకేజింగ్ ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవలేదని వెల్లడించింది.

చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను ఆధారంగా చూపిస్తూ ఈ ప్రకటన చేసింది WHO. పరిశోధనలో భాగంగా చైనా కొన్ని లక్షల ఆహార పదార్ధాలు, వాటి ప్యాకేజింగ్ లపై కరోనా పరీక్షలు జరిపింది. కాగా వీటిలో అత్యంత తక్కువ ప్యాకేజింగ్ లపై కరోనా వైరస్ ను గుర్తించినట్లు తెలియజేశారు. ఇక ఆహర పదార్ధాల కొనుగోలు విషయంలో భయపడాల్సిన పని లేదని WHO తేల్చి చెప్పేసింది.

Next Story