నిర్మల్ జిల్లాలో డబ్ల్యూహెచ్‌వో బృందం

by  |
నిర్మల్ జిల్లాలో డబ్ల్యూహెచ్‌వో బృందం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టే చర్యలు తీసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) రంగంలోకి దిగింది. వైరస్ తీవ్రత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోను అరికట్టే చర్యలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్ర దవాఖానాల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, నిర్వహణపై డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రెండు రోజులుగా బృందం జిల్లాలోనే ఉండి కరోనా నివారణ చర్యలు చేపట్టింది. డబ్ల్యూహెచ్‌వో స్టేట్ మానిటరింగ్ అధికారి డాక్టర్ అతుల్ నేతృత్వంలో ఈ బృందం పరిశీలన చేస్తుంది. వీరి వెంట నిర్మల్ జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ కార్తీక్ లైజనింగ్ చేస్తున్నారు.

tag: WHO Representatives, corona virus, Preventive measures

Next Story

Most Viewed