బీజేపీ నుంచి ఎవరు?

by  |
బీజేపీ నుంచి ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నాగార్జునసాగర్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. కీలకమైన ఈ సీటును గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టుంది. అయితే గత ఎన్నికల్లో అక్కడ టీఆర్‌ఎస్ పాగా వేసింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఇప్పుడు జానారెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తాము గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన పోటీ అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. టీఆర్‌ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును టీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది.

ఇక గత కొద్దినెలల క్రితం జరిగిన దుబ్బాక ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీ.. నాగార్జున సాగర్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టింది. అయితే ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. తాజాగా బండి సంజయ్‌తో బీజేపీ నేతలు శ్రీనివాస్, సంకినేని భేటీ అయి నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చించారు.

బీజేపీ నుంచి అంజయ్య, రవినాయక్ పేర్లు ప్రముఖంగా రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి సీటు కేటాయిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. నేడు లేదా రేపు టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది.


Next Story

Most Viewed