డేంజర్: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీటిని అస్సలే తినొద్దు..!

by Disha Web Desk 7 |
డేంజర్: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీటిని అస్సలే తినొద్దు..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో చల్లగా ఏదన్న తినాలని, తాగాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే మొదట గుర్తు వచ్చేది ఐస్ క్రీమ్. చిన్న పిల్లలు అయినా, పెద్దలు అయినా ఐస్ క్రీమ్‌ను ఇష్టంగా తింటారు. అయితే.. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదట. అవి తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తినకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీ కానీ కాఫీని పొరపాటున కూడా తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీసి.. కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది.

* చాలా మందికి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాహం వేస్తుంది. దీందో వెంటనే వాటర్ తాగుతారు. అయితే ఇలా చెయ్యకూడదని చెబుతున్నారు నిపుణులు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీళ్లను తాగితే.. ఎండాకాలం జలుబుకు దారితీసే అవకాశాలు ఉన్నాయంట. అంతే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట.

* అలాగే.. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేడివేడిగా ఉండే పదార్థాలు తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చల్ల పదార్థాలు తిన్న వెంటనే వేడివేడిగా తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

* ఇక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తినకూడని ముఖ్యమైన వాటిలో పుల్లటి వండ్లు. ముఖ్యంగా నారింజ, ద్రాక్షపండు లేదా నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను తినకూడదు.

* అలాగే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే పెరుగు కూడా తినకూడదట. అలా తినాలి అనిపిస్తే.. కాస్త గ్యాప్ ఇచ్చి తినడం మంచిది అంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed