సీఎం చదువుకొని ఉంటే రాజ్యాంగం మార్చడంపై తెలిసేది

by Disha Web Desk 15 |
సీఎం చదువుకొని ఉంటే రాజ్యాంగం మార్చడంపై తెలిసేది
X

దిశ, మెదక్ ప్రతినిధి : భారత రాజ్యాంగాన్ని మార్చుడు సాధ్యమేనా అనేది సీఎం రేవంత్ రెడ్డి చదువుకుంటే తెలిసేదని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని స్వయంగా మోడీ చెప్పిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాజ్యాంగ సవరణ మాత్రమే చేస్తారని, అది ఇప్పటి వరకు 106 సార్లు మీ కాంగ్రెస్ పాలనలోనే జరిగిన విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని, బీజేపీకి అవసరమైన సీఎంలు రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. ఇదే కాంగ్రెస్ హయంలో షాబాను అనే ముస్లిం మహిళలు సుప్రీం ఇచ్చిన మనోవర్తి తీర్పును అప్పటి పాలకులు చించిపారేశారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన మోడీ గురించి ముస్లిం మహిళలు ఆలోచించాలని అన్నారు.

మోడీ నినాదం సబ్ కా సాత్ సభ్ కా వికాస్ అన్నారు. రాజ్యాంగ సవరణ ఎన్నిసార్లు జరిగిందో సీఎం తెలుసుకోవాలన్నారు. దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి ప్రజలను, మీడియాని అణిచి వేసింది కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజలు ఇప్పటికీ ఇంకా మరిచిపోలేదన్నారు. ఏడేళ్ల అధికారంలో ఉంది చెప్పి మరీ 370 ఆర్టికల్ రద్దు చేశాం, ఓబీసీ లకు రిజర్వేషన్ లు మోడీ ప్రభుత్వమే కల్పించిందన్నారు. రాజ్యాంగ సవరణ పై తాము చర్చకు సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే దయ్యాలు వేదాలు వళ్లిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ లో అయ్యా కొడుకులు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటున్నారని,

ఇదే మాట ముస్లిం, ఆదివారం ప్రార్థన మందిరాల వద్ద చెప్పగలా అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటేనే కేసీఆర్, కేటీఆర్ లను గ్రామాల్లో తిరగనిస్తామని అన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఒక ఆకు ఎక్కువే చదివాడని, లిక్కర్ కేసులో కవిత బెయిల్ కోసం బీజేపీ, బీఆర్ ఎస్ లు సీట్లు పంచుకున్నాయని కొత్త నాటకం మొదలు పెట్టాడని అన్నారు. అరెస్ట్ చేయకుంటే చేయలేదని, చేస్తే బెయిల్ కోసం లోపాయికారి ఒప్పందం అంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ లక్షల కోట్లు కొల్లగొట్టాడని, రికవరీ చేసి పేదలకు పెంచుతామని రాహుల్ తో చెప్పించి ఎంతమందికి పంచావో చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ రాష్ట్రంలోకి రావద్దని కేసీఆర్ తెచ్చిన 51 జీవో ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బసవ లక్ష్మీ నరసయ్య, మురళి యాదవ్, పంజా విజయ్, సంగమేశ్వర్, నడగామ శ్రీనివాస్, ఎక్కడ దేవి మధు, ఎంఎల్ ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed