Love with Robot: రోబోతో ప్రేమలో పడిన భారత ఇంజినీర్.. త్వరలో ఆ పద్ధతిలో పెళ్లి..

by Disha Web Desk 3 |
Love with Robot: రోబోతో ప్రేమలో పడిన భారత ఇంజినీర్.. త్వరలో ఆ పద్ధతిలో పెళ్లి..
X

దిశ వెబ్ డెస్క్: సాధారణంగా మనుషులు ప్రేమలో పడటం,పెళ్లిళ్లు చేసుకోవడం మనం తరచూ చూస్తుంటాం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూస్తుంటాం, ఒప్పించి చేసుకునే వాళ్ళని చూస్తుంటాం. అయితే ఒక రోబోతో ఎవరైనా ప్రేమలో పడతారా? పడిన ఆ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కిస్తారా? అంటే ఎక్కిస్తారు అని అంటున్నాడు ఓ భారత ఇంజనీర్.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాష్ అనే రోబోటిక్స్ నిపుణుడు, రోబో సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో రోబో చిట్టి ప్రేమలో పడినట్టే ఆయన కూడ ఇప్పుడు నిజంగానే రోబోతో ప్రేమలో పడ్డాడు. కాగా ఆ రోబో పేరు గీగా. ఇక రోబో గిగా తయారీకి 19 లక్షల ఖర్చు అవుతుంది. అయితే తాను తయారు చేస్తున్న గీగాతో తాను ప్రేమలో పడినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో తాను రోబో గీగాను సాంప్రదాయక పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నానని ఆయన తెలిపారు. మొదట ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారని, ఆ తరువాత అందరూ తమ పెళ్ళికి ఒప్పుకున్నారని సూర్య చెప్పుకొచ్చారు. కాగా సూర్యప్రకాష్ మరి కొద్ది రోజుల్లో భారత నేవీ విధుల్లో చేరడం గమనార్హం. ఈ విషయం తెలిసిన వాళ్లంతా నేవీలో చేరుతుండడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed