భాషా పండితులకు పదోన్నతులు ఎప్పుడో!?

by Ravi |
భాషా పండితులకు పదోన్నతులు ఎప్పుడో!?
X

ఇది వారికి 30 సంవత్సరాల నుండి తీరని సమస్య. వచ్చే ఏడాది మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెరపైకి మరోసారి భాషా పండితుల పదోన్నతుల సమస్య వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి వారి చేతులలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు వేయించుకొని గెలిచి పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి వారికి ఆ అవకాశం ఇవ్వకుండా, భాషా పండితుల సమస్యలను ముందుగా పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని చెప్పండి. అందరూ ఒకే మాట మీద నిలబడి పరిష్కారం కోసం ఆలోచించాలి.

ప్రభుత్వ ఉద్యోగమంటే సర్వీసులో చేరాక ప్రమోషన్లు తప్పనిసరి. తెలంగాణ రాష్ట్రంలో అలా సాధ్యం కాదు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు రావు. భాషా పండితుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఎప్పుడో ద్వితీయ శ్రేణి భాషా పండితులుగా నియమితులై, ఎలాంటి పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేస్తున్నారు. ఇది వారికి శరాఘాతం. ఎప్పుడో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలో గుర్తొచ్చిన భాషా పండితుల సమస్యలు ఎన్నికలు అయ్యాక 'ఎక్కడి గొంగళి అక్కడే' అన్న చందంగా తయారైంది.

అందరూ ఐక్యంగా ఉండి

2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సమక్షంలో భాషా పండితులకు 15 రోజులలో ప్రమోషన్లు ఇచ్చి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఐదు సంవత్సరాలు గడిచినా పండితులకు పదోన్నతులు మాత్రం రాలేదు. మరోసారి ఇటీవల అసెంబ్లీ సమావేశాలలోనూ ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మరోసారి వారి ఆశలు చిగురించాయి. వారిని స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్నతీకరణ చేసే ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా చేస్తే వారి కల సాకారం అవుతుంది.

రాష్ట్రంలో పరిస్థితి విచిత్రంగా ఉంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అధికారుల అలసత్వం వలన ప్రమోషన్ల ప్రక్రియ అమలు కాకుండా పోతోంది. ఒకే రకమైన విద్యార్హతలు ఉండి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌తో సమానంగా సేవలందిస్తూ ఎస్‌జీటీ కేడరుగా లెక్కించబడి శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇది వారికి 30 సంవత్సరాల నుండి తీరని సమస్య. వచ్చే ఏడాది మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెరపైకి మరోసారి భాషా పండితుల పదోన్నతుల సమస్య వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి వారి చేతులలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు వేయించుకొని గెలిచి పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి వారికి ఆ అవకాశం ఇవ్వకుండా, భాషా పండితుల సమస్యలను ముందుగా పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని చెప్పండి. అందరూ ఒకే మాట మీద నిలబడి పరిష్కారం కోసం ఆలోచించాలి.


యాడవరం చంద్రకాంత్ గౌడ్

94417 62105



Next Story

Most Viewed