బీర్ల కొరత ఎఫెక్ట్.. ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం

by Disha Web Desk 12 |
బీర్ల కొరత ఎఫెక్ట్.. ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం
X

దిశ. వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో గత కొంతకాలంగా ఏర్పడిన నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మద్యం తయారిపై కూడా ప్రభావం పడింది. ఈ క్రమంలో బెంగళూరు పట్టణంలో బీర్ల కొరత ఏర్పడింది. ఓ వైపు వేసవి ఎండలు దంచి పడుతుండటంతో మందుబాబులు బీర్లు లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే బీర్ల కొరత కారణంగా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని, వినియోగదారులపై ప్రభావం పడుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న మద్యం ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. వేడిగాలుల తర్వాత ఇటీవలి రోజుల్లో పబ్‌లు, బ్రూవరీలలో మద్యానికి డిమాండ్ పెరిగిందని, ఫలితంగా ఈ వాణిజ్య సంస్థల్లో మద్యం కొరత ఏర్పడిందని భావిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి నీటిని తీసుకొని మరి బీర్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధరలు పెంపుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed