చేతులు జోడించి నమస్కరిస్తారెందుకు?

by  |
చేతులు జోడించి నమస్కరిస్తారెందుకు?
X

దిశ, వెబ్ డెస్క్: ఎదుటి వ్యక్తిని గౌరవించాలంటే మొదటగా నమస్కరిస్తుంటాం కదా.. చేతులెత్తి నమస్కరించడమేనది ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. గతంలో అయితే చాలావరకు చేతులు కలుపుకుని లేదా ఒక చేయిని పైకెత్తి హలో, హాయి, గుడ్మార్నింగ్, గుడీవ్నీంగ్.. ఇలా పలు రకాలుగా చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తిని గౌరవంగా పలకరించేవాళ్లం. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ కూడా చేతులెత్తే నమస్కరిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రపంచమంతా పాటిస్తున్నారు. అలా చేతులెత్తి ఎందుకు నమస్కరిస్తారోననేది మీకు తెలుసా? అయితే.. ఈ స్టోరీని చదవండి..

నమస్కరించడం వెనుక రెండు రీజన్లు ఉన్నాయి. అవేమిటంటే.. ఆరోగ్యంగా ఉండేందుకు మన పూర్వీకులు కొన్ని సంప్రదాయబద్ధమైన సూచనలు చేశారు. ఆ సూచనలన్నింటిలోనూ సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం చేతులెత్తి నమస్కారం చేయడం కూడా అందులో భాగమే. దీని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. నమస్కారం పెట్టేందుకు రెండు చేతులు కలిపినప్పుడు చేతి వేళ్లు ఒకదానికొకటి తాకుతాయి. ఆ సమయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి నరాల వరకు చేరుతది. అప్పుడు ఆ నరాలు ఆ ఒత్తిడి విషయాన్ని మెదడుకు, కళ్లకు తీసుకెళ్తాయి. దీంతో ఆ ఎదుటి వ్యక్తి మనకు చాలాకాలం గుర్తుండిపోతాడు.

మరొక విశేషముంది. అదేమిటంటే.. చేతులెత్తి నమస్కరించడం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు భౌతికంగా ఒకరినొకరు తాకడానికి వీలుండదు. దీంతో ఒకరి నుంచి మరొకరికి క్రిములు సోకే అవకాశముండదు. ఇలా ఉపయోగకరంగా ఉంటది కాబట్టే మన పూర్వీకులు సైంటిఫిక్ గా ఆలోచించి వాటిని సంప్రదాయ బద్ధంగా సూచన చేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఇది ఫాలో అవుతూ వస్తున్నారు.

tags:Namaskar, Hello, Scientific Reason, Stress Signals, Brain, Eyes


Next Story

Most Viewed