ఈ రాశి వారికి గుడ్‌న్యూస్.. ఉద్యోగంలో ప్రమోషన్

237
Panchangam

తేది : 8, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 38 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 33 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న సాయంత్రం 5 గం॥ 3 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 54 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : బవ
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 25 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 19 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥లకు)

మేష రాశి: సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయం. దైవప్రార్థన వలన బలం. ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆఫీసులో ఎవ్వరితోనూ వాదోప వాదాలకు దిగకండి. సహనం పాటించండి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన తలనొప్పి. కుటుంబంలోని వ్యక్తుల కొరకు కొంత సమయం కేటాయించండి వాడితో గడపండి. డబ్బు పెట్టుబడి నిర్ణయాలను వాయిదా వేయండి. చిన్న వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీ తోటే లోకం అని గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

వృషభ రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులు సమయంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. లేకుంటే పని పెండింగ్ పడుతుంది. కొంతమందికి కుటుంబ ఆస్తి పంపకాలు సంతోషాన్ని ఇస్తాయి. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు కుటుంబంలో పెద్దలకు అనారోగ్యం. వారి ఆరోగ్యం కొరకు ఖర్చు చేయవలసి వస్తుంది. దీనివలన మీకు మానసిక అశాంతి ఈ రాశి స్త్రీలకు మీ భర్త కుటుంబ వ్యవహారాలలో ఉన్న చికాకులు మీ మీద చూపిస్తారు.

మిథున రాశి: భార్యాభర్తలు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటారు. కొంతమంది విహార యాత్రలు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. ఎవ్వరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి. పాత స్నేహితులతో కలసి ఆనందిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో మీ తండ్రిగారి సలహా తీసుకోండి. కుటుంబములోని వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభాలను తెస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్య లోకి వేరొకరిని రానీయకండి.

కర్కాటక రాశి: గందరగోళం నిరాశావాదం వదిలివేయండి దైవ ప్రార్థనలు వలన మానసిక బలం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను పూర్తి చేయటానికి సరైన ప్రణాళిక తప్పనిసరి. కొంతమందికి ప్రమోషన్ రావచ్చు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవ్వటం వల్ల మానసిక అశాంతి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దగ్గు జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్యలో కి మూడో వ్యక్తిని రానీయకండి.

సింహరాశి: మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. గందరగోళం భయాలూ నిరాశావాదం వదిలివేయండి. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి వారి మనసులో ఏముందో తెలుసుకోండి. డబ్బు సంపాదనకు కావలసిన అన్ని మార్గాలు వెతుకుతారు. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ ఉన్నప్పటికీ సమయానికి పూర్తిచేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ మానసిక చికాకులను మీ భర్త మీద చూపించకండి.

కన్య రాశి: పరిస్థితులను బట్టి ప్రవర్తించండి. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించండి వారితో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. అనవసరపు విషయాల గురించి ఆలోచించడం వలన సమయం వృధా. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. బయట భోజనం వల్ల ఇబ్బంది మానేయండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. బయట భోజనం వల్ల అజీర్తి. పాత స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు ఆటలు ఎక్కువ సేపు ఆడటం మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

వృశ్చిక రాశి: సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలు సాధిస్తారు విద్యార్థులు చదువు మీద పూర్తిగా శ్రద్ధ పెట్టవలసిన తరుణం. స్నేహితులతో బాతాఖానీ వలన సమయం డబ్బు రెండూ వృధా. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం వలన ఎంతో ఎనర్జీ. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసులో పనులను చాకచక్యంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి: ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. దైవప్రార్థన వలన బలం. ఆఫీసులో తోటి ఉద్యోగులతో అభిప్రాయభేదాలు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారికి ధరలు అందుబాటులోకి వస్తాయి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. అనవసరపు ఖర్చులు గురించి కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటు ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

మకర రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే ప్రణాళిక తప్పనిసరి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. కొంతమందికి విదేశీ ప్రయాణాలు. కొంత మందికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలం. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ పనులు పూర్తి కాలేదని మానసిక అశాంతి. తోటి ఉద్యోగుల సహాయం తీసుకోండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. దుబారా ఖర్చు ల వలన అనుకోని ఇబ్బందులు. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభరాశి: శాంతి విలువ తెలవాలి అంటే యుద్ధం జరగాలి అనే జీవిత సత్యం తెలుసుకుంటారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. సహోదరుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల జోలికి పోకండి. ఆఫీసు పనులలో నిర్లక్ష్యం వహించకండి. తప్పులు జరిగే అవకాశం. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మీ పార్ట్నర్స్ మీద ఒక కన్ను వేసి ఉంచండి. మీ పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి. ఈ రాశి స్త్రీలు పాత గొడవలు మరిచిపోయి భర్తతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.

మీన రాశి: కోపము భయము గందరగోళం వదిలివేయండి. ఇది మిమ్మల్ని పూర్తిగా నిరాశావాదం లోకి నెడతాయి. దైవ ప్రార్ధన ఒక చక్కటి ఉపాయం. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. మీ భార్య కుటుంబంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్థం చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. కొంతమంది ఉద్యోగులకు జీతాలు లో పెరుగుదల. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్యలో కి మూడవ వ్యక్తిని రానీయకండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..