ఎన్నికల టైంలో ఉగ్రదాడి కొత్తేమీ కాదు: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్

by Dishanational2 |
ఎన్నికల టైంలో ఉగ్రదాడి కొత్తేమీ కాదు: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరగగా..దీనిపై పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాషాయ పార్టీ ఎన్నికల టైంలో ఏమైనా చేయగలదని మండిపడ్డారు. ‘పుల్వామా దాడి ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది, దీనిపై అప్పటి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ప్రశ్నలు సంధించారు. కాబట్టి తాజాగా కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడం కూడా కొత్తగా ఏం అనిపించలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ ఏమైనా చేయగలదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం పూంచ్‌లో ఉగ్రదాడి జరగగా.. ఒక సైనికుడు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఫిబ్రవరి 2019 ఎన్నికల టైంలోనూ పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

Next Story