వణికిస్తున్న చలి.. కోహిర్ లో ఏకంగా 4.5 డిగ్రీలు

by Muthe.Rajitha |

రెండు తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది.

వణికిస్తున్న చలి.. కోహిర్ లో ఏకంగా 4.5 డిగ్రీలు
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. నేడు ఉదయం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలితోపాటు తీవ్రమైన పొంగమంచు కురుస్తుండటంతో 11 జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాదారణం కంటే 4 - 5 డిగ్రీలు తక్కువ నమోదు అవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. మరోవైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలు నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7 డిగ్రీల కమిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story