శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రానికి తప్పిన ముప్పు

by Muthe.Rajitha |

తగ్గనున్న చలి తీవ్రత.. కారణం ఇదే

శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రానికి తప్పిన ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు ఏపీకి అల్పపీడన గండం తప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. శుక్రవారం నాటికి తమిళనాడు తీరం వైపు కదలవచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తమిళనాట విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ వాయుగుండం ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని, కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని, మిగతా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని ఉంటాయని పేర్కొంది. దీని వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Next Story