బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

by Muthe.Rajitha |

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనం(LPA)గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగ (IMD) మంగళవారం వెల్లడించింది.

బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనం(LPA)గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగ (IMD) మంగళవారం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం.. దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు బంగాళాఖాతంపై ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి, 36-48 గంటల్లో వాయుగుండంగా మారి, దక్షిణ-మధ్య బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తూర్పు ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద అక్టోబర్ 24-25 నాటికి చేరుకోవచ్చని IMD అంచనా వేస్తోంది.

ఈ వాయుగుండం ప్రభావం ఏపీలోని రాయలసీమపై భారీగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to Very Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని, 15 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదు కావొచ్చని IMD తెలిపింది. కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షపాతం, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మరో 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Light to Moderate Rainfall) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న 4 రోజుల్లో) మోస్తరు వర్షాలు (Moderate Rainfall) పడే అవకాశం ఉందని తెలియజేసింది.

Next Story