- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర అల్పపీడనం.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
వాయుగుండం మంగళవారానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతోండగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 12 గంటల్లో ఇది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం మంగళవారానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఏపీలోని (Andhrapradesh) విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేశారు. అలాగే, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు అరెంజ్ అలర్ట్ (Orange alert).. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, కడప జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow alert) జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే తెలంగాణలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.






