ఈరోజు రాత్రి నగరవాసులకు విశ్వరూపం చూపించనున్న చలి

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని నగరాన్ని ఈరోజు రాత్రి చలి వణికించనుంది.

ఈరోజు రాత్రి నగరవాసులకు విశ్వరూపం చూపించనున్న చలి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని నగరాన్ని ఈరోజు రాత్రి చలి వణికించనుంది. శుక్రవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సుమారు 10°C కంటే తక్కువకు టెంపరేచర్ నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేసారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ తెలంగాణలో 9–11°C మధ్య చల్లని పరిస్థితులు కొనసాగుతాయని చెప్పారు. అలాగే తుఫాన్‌ ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి 5 వరకు మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట్, నల్గొండ, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Next Story