రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 05:00:11  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘మొంథా’ తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం విదితమే.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘మొంథా’ తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం విదితమే. మచిలీపట్నం సమీపంలో తుపాను తీరం దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో పాటు సుమారు గంటకు 110 కి.మీ. వేగంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుల కారణంగా పంటలన్నీ నెలకొరిగాయి. దీంతో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావం ఉన్న కోనసీమ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు తొందరపడి వేటకు వెళ్లొద్దని నిషేధాజ్ఞలు విధించారు. మరోవైపు తుపాను నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అయితే, రాబోయే మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Next Story