నగరంలో రాత్రి నుంచి జోరు వర్షం.. వినాయక చవితి వేడుకలకు ఆటంకం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-27 03:43:23  IST  )

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది.

నగరంలో రాత్రి నుంచి జోరు వర్షం.. వినాయక చవితి వేడుకలకు ఆటంకం
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో వినాయక చవితి వేడుకులకు ఆటకం కలుగుతోంది. ప్రజలకు ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వాతావరణ శాఖ నగరానికి ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఇక వినాయక విగ్రహాల కొనుగోళ్లు వర్షంలోనూ జోరుగా కొనసాగుతున్నాయి. ధూల్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) అధికారులువెల్లడించారు. అల్పపీడన ప్రభావం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వెళ్లి మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని ప్రజలను అధికారులు సూచించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడపలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Next Story