Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad) నగరంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం(Heavy Rain) కురిసింది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad) నగరంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం(Heavy Rain) కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్, బాలానగర్, సనత్ నగర్, కోటి, నాంపల్లి, చార్మినార్, మలక్ పేట్, మెహెదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం(Scattered Thunderstorms) పడింది. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా మరో రెండు గంటలపాటు ఈ వర్షం కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నేడు తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు(Massive Heat) నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైంది.

Next Story