ఆ బీచ్‌లో అరుదైన మేఘం.. తుఫాను రాకను సూచిస్తోందా?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-03 07:30:05  IST  )

వర్షాకాలంలో ఆకాశం తరచుగా మేఘావృతమై ఉంటుందనే విషయం తెలిసిందే

ఆ బీచ్‌లో అరుదైన మేఘం.. తుఫాను రాకను సూచిస్తోందా?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: వర్షాకాలంలో ఆకాశం తరచుగా మేఘావృతమై ఉంటుందనే విషయం తెలిసిందే. సాధారణంగా నైరుతి రుతుపవనాల విస్తరణ సందర్భంగా వర్షాలు కురవడం సహజం. జూన్ మొదటి వారంలో నైరుతి విస్తరించడంతో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ద్రోణి ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఆకస్మాత్తుగా నల్లని మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడమే కాకుండా.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టిస్తాయి. ఇటువంటి సమయాలలో సముద్ర తీరంలోని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తారు. అలాగే, బీచ్‌లకు వెళ్లొకూడదని హెచ్చరికలు జారీ చేస్తారు.

తాజాగా, ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోర్చుగల్‌లోని పోవోవా డా వర్జిమ్ బీచ్‌లో ఆవిష్కృతమైన ఓ దృశ్యం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోర్చుగల్‌లో తీవ్రమైన వేడి ఉంది. ఆ సమయంలో ఈ దృశ్యం కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి సముద్రం వైపు తీరం వైపు ఒక భారీ, మందపాటి మరియు స్థూపాకార మేఘం వస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేఘం తీరం వైపుకు రాగానే, బలమైన గాలులు వీయడం ప్రారంభమైంది. దీంతో బీచ్‌లోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఇది సహజమైన రోల్ క్లౌడ్ దృగ్విషయం. రోల్ క్లౌడ్ అంటే గాలిలో ఏర్పడే ఒక ప్రత్యేకమైన ట్యూబ్-ఆకారపు మేఘం. ఇది వాతావరణంలో మార్పులను సూచిస్తుంది. ముఖ్యంగా బలమైన గాలులు లేదా తుఫానుల రాకను తెలియజేస్తుంది. ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి దృశ్యం కనిపించింది. ఈ తుఫాను యూరప్‌కు వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుందా? తుపాన్ రాబోతుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో పై స్పందించిన వాతావరణ శాఖ అధికారులు.. ఇది రోల్ క్లౌడ్. వేడి, పొడి గాలి మరియు చల్లని సముద్ర గాలి మధ్య ఢీకొన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు ఆకాశంలో పొడవైన, స్థూపాకార, దొర్లుతున్న మేఘాన్ని సృష్టిస్తుంది. ఇది అలలా కనిపిస్తుంది. ఈ మేఘం సునామీలా కనిపిస్తుంది. అయితే, దీనికి భూకంపం లేదా సముద్రపు అలలతో సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. వాతావరణం చోటుచేసుకున్న ఈ మార్పుతో ఎలాంటి హాని ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.వీడియో

Next Story