- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీని వణికిస్తున్న చలి.. ఏకంగా 5.3 కు పడిపోయిన టెంపరేచర్
by Muthe.Rajitha |
ఏపీని చలి వణికిస్తోంది. చలికాలం మొదలైనప్పటి నుంచి మొదటిసారిగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీని చలి వణికిస్తోంది. చలికాలం మొదలైనప్పటి నుంచి మొదటిసారిగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి. మాడుగులలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతారవరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ముంచంగిపుట్టులో 7.7, దుబ్రిగూడ 8.2, అరకులో 8.9, చింతపల్లిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మరో నాలుగు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు తెలంగాణలోనూ ఈ ఏడాది తొలిసారిగా అత్యంత కనిష్ట ఉష్ణిగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి బాగా పెరిగింది.
Next Story






