- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG Alert: నగరవాసులకు మరో హెచ్చరిక.. రెండు గంటల్లో అతి భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం (Surface Trough Effect) కారణంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్ని రేంజ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం (Surface Trough Effect) కారణంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్ని రేంజ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవాళ మరింతగా బలపడటంతో ముఖ్యంగా హైదరాబాద్ మహానగంలో రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజలెవరూ అత్యవసరం అయితేనే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు.
మరో రెండు గంటల్లో భారీ వర్షం రానుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు. బ్లాక్ అయిన నాలాలు, మ్యాన్ హోల్‌లను వర్షం రాకముందే క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ (Department of Meteorology) ఇప్పటికే ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాద్రాద్రి భువనగిరి, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో గంటలకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.






