- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసి ముద్దవుతోన్న భాగ్యనగరం.. అత్యధిక వర్షపాతం నమోదైంది అక్కడే!
హైదరాబాద్ (Hyderabad) మహానగరంపై వరుణుడు పగబట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంపై వరుణుడు పగబట్టాడు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పరిధిలో 5.2 సెం.మీ వర్షపాత నమోదైంది. చందానగర్‌లో 4.7 సెం.మీ, హైదర్ నగర్‌లో 4.6 సెం.మీ, లింగంపల్లిలో 4.6 సెం.మీ, పటాన్‌చెరులో 4.4 సెం.మీ, కేపీహెచ్‌బీలో 4.3 సెం.మీ, యూసఫ్‌గూడలో 4.3 సెం.మీ, షేక్‌పేట్ 4.3 సెం.మీ, రామచంద్రాపురంలో 4.3 సెం.మీ, హఫీజ్‌పేటలో 4.3 సెం.మీ, బంజారాహిల్స్‌లో 4.2 సెం.మీ, బోరంబండలో 4.2 సెం.మీ, కూకట్‌పల్లిలో 4.2 సెం.మీ, గచ్చిబౌలిలో 4.1 సెం.మీ, బాలానగర్‌లో 3.9 సెం.మీ, ఖైరతాబాద్‌లో 3.9 సెం.మీ, మాదాపూర్‌లో 3.8 సెం.మీ, ముషీరాబాద్‌లో 3.6 సెం.మీ, ఫిల్మ్‌నగర్ పరిధిలో 3.6 సెం.మీ వర్షపాత నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.






