ఓ వైపు వణికిస్తున్న చలి.. మరోవైపు భారీగా పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ

by Muthe.Rajitha |

తెలంగాణలో ప్రస్తుతం చలి తీవ్రంగా వణికిస్తోంది.

ఓ వైపు వణికిస్తున్న చలి.. మరోవైపు భారీగా పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రస్తుతం చలి తీవ్రంగా వణికిస్తోంది. అనేక జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఈ పరిస్థితి డిసెంబర్‌ 31 వరకు మాత్రమే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని తెలిపింది. జనవరి ప్రారంభంలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండి సంక్రాంతి సమయంలో మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌, కొమురం భీం, సంగారెడ్డి, మెదక్‌, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో చలితో పాటు వాయు కాలుష్యం కూడా తీవ్రంగా పెరిగింది.

నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 230 దాటగా, అమీన్‌పూర్‌లో 289, గచ్చిబౌలిలో 286 పాయింట్లు నమోదయ్యాయి. మాదాపూర్‌, విట్టల్‌రావు నగర్‌, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, సోమాజిగూడ, కోటి, బంజారా హిల్స్‌, మణికొండ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ తదితర ప్రాంతాల్లో కూడా AQI 200కు పైగా నమోదైంది. చలి, పొగమంచు, వాహనాల పొగ, చెత్త దహనం కారణంగా గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరిగి ముఖ్యంగా ఉదయ వేళల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story