- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. అసలేంటీ ఈ హెచ్చరికలు? ఎన్నిరకాలు?
మొంథా తుఫాను మరికొద్దిగంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను మరికొద్దిగంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. మరోగంటలో కాకినాడకు దగ్గరలో తుఫాను తీరం దాటనుండగా... కాకినాడ పోస్టుకు 10వ నెంబర్ ప్రమాదస్థాయి హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ పోర్టులకు జారీ చేసే హెచ్చరికలు ఏంటి? అవి ఎన్ని రకాలో తెలుసుకుందాం. తుఫాను తీవ్రత బట్టి 4 కేటగిరీలుగా విభజించిన 1-11 స్థాయుల హెచ్చరికలను భారత వాతావరణ విభాగం పోర్టులకు జారీ చేస్తుంది.
అందులో..
A: ముప్పు దూరం (Distant bad weather).. 1: పీడనం పోర్టుకు దూరంగా ఉంటుంది. 2: సముద్రంలో తుఫాను ఉంటుంది. పోర్టును వీడే నౌకలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది.
B: ముప్పు దగ్గరగా (Local Bad Weather).. 3: పోర్టు వద్ద తీవ్రమైన ఈదురు గాలులు వీస్తాయి. 4: పోర్టుపై తుఫాను ప్రభావం చూపవచ్చు.
C: ప్రమాద సంకేతం (Danger).. 5: పోర్టుకు ఎడమ వైపు తుఫాను తీరం దాటొచ్చు. 6: కుడివైపు దాటొచ్చు. 7: పోర్టు దగ్గరగా లేదా పోర్టు మీదుగా తీరం దాటొచ్చు.
D: పెను ప్రమాదం (Great danger).. 8: భారీ తుఫాను పోర్టు ఎడమ వైపుగా తీరం దాటుతుంది. 9: కుడి వైపుగా దాటనుంది. 10: దగ్గర లేదా పై నుంచి దాటనుంది. 11: తుఫానుతో సమాచార వ్యవస్థ ధ్వంసం అవ్వొచ్చు.
ఈ హెచ్చరికలను బట్టి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ కూడా అన్ని రక్షణ ఏర్పాట్లు చేస్తుంది.
Read More... అవసరం అయితే ఆర్మీని దించుతాం.. మంత్రి నారా లోకేష్ ప్రకటన






