- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోనీ కోసం మళ్లీ ఐపీఎల్ గెలుస్తాం
<p>దిశ, స్పోర్ట్స్: మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తామని సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా అన్నాడు. 2021లో సీఎస్కే కనుక ఐపీఎల్ టైటిల్ గెలిస్తే మహీ మరో రెండేళ్ల పాటు లీగ్‌లో కొనసాగే అవకాశం ఉందని రైనా ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మా జట్టు చాలా జోరు మీద ఉన్నది. మా జట్టులోని డ్వేన్ బ్రావో, సామ్ కరన్, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ధోనీ […]</p>

దిశ, స్పోర్ట్స్: మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తామని సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా అన్నాడు. 2021లో సీఎస్కే కనుక ఐపీఎల్ టైటిల్ గెలిస్తే మహీ మరో రెండేళ్ల పాటు లీగ్‌లో కొనసాగే అవకాశం ఉందని రైనా ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మా జట్టు చాలా జోరు మీద ఉన్నది. మా జట్టులోని డ్వేన్ బ్రావో, సామ్ కరన్, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ధోనీ ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛను ఇస్తాడు. అందుకే మేం విజయాలు సాధించగలుగుతున్నాము. ఈ సారి ధోనీ కోసం టైటిల్ గెలుస్తామనే ధీమా ఉన్నది. అతను నాకు సోదరుడి లాంటి వాడు. ధోనీ సారథ్యం వల్ల మాకు అదనపు ఆత్మవిశ్వాసం లభిస్తున్నది అని రైనా అన్నాడు. గత ఏడాది అగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెంటనే సురేష్ రైనా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా, ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రైనా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.






