‘పవర్’ తుఫాన్ మొదలైంది..

by  |
‘పవర్’ తుఫాన్ మొదలైంది..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఏడాది మొత్తం ఫుల్ ఫెస్టివల్ ఇయర్ అని చెప్పాలి. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, క్రిష్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ, సాగర్ కరే.చంద్ర దర్శకత్వంలో మళయాలం రీమేక్ అయ్యప్పనమ్ కోషియమ్‌లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరిగేలా డేట్స్ అడ్జెస్ట్ చేసిన, షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అయ్యప్పనుమ్ కోషియమ్‌ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పూజా కార్యాక్రమంల పూర్తయింది. తాజాగా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.

ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, మంగళవారం చిత్రం షూటింగ్‌కు సంబంధించి, ‘పవర్ తుఫాన్’ షురూ అంటూ ఒక వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ బులెట్‌ను డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సీన్స్‌ను షూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేగాకుండా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తున్నారు. రానా దగ్గుపాటి మరో ప్రధాన పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో అందించనుండగా, సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


Next Story