పే స్కేల్ అమలు కావడంలేదని వీఆర్ఏ ఆత్మహత్య

115
11114-VRA

దిశ, కామారెడ్డి: పే స్కేల్ అమలు కావడంలేదని వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్(ఎం) గ్రామానికి చెందిన సల్ల రమేష్ గత ఎనిమిది సంవత్సరాలుగా వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత ఏడాది సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ప్రకటించడంతో వీఆర్ఏ రమేష్ హర్షం వ్యక్తం చేశాడు. గత సంవత్సర కాలంగా పే స్కేల్ కోసం రమేష్ ఎదురు చూస్తూ ఉన్నాడు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ పే స్కేల్ ఎప్పుడు అమలు అవుతదోనని తోటి వీఆర్ఏలతో చర్చించేవాడు. కొన్ని నెలలుగా రమేష్ కు అప్పులు పెరిగి పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీనికి తోడు పే స్కేల్ అమలు కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై రమేష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న మాచారెడ్డి పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..