మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. కొత్తగా మరో 1500 పెంపు?

by Disha Web Desk 9 |
మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. కొత్తగా మరో 1500 పెంపు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆరు స్కీంలను ప్రకటించిన విషయమే. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. గతేడాది డిసెంబరు 9 న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాదులో ఈ పథకాన్ని ప్రారంభించారు. డిసెంబరు 15 నుంచి జీరో టికెట్స్ జారీ చేస్తున్నారు. ఈ స్కీమ్‌తో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో సీట్ల కోసం మహిళలు గొడవలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 1500 ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా జులై నాటికి 450 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.



Next Story