అంతరిక్షం నుంచి ఓటింగ్ ఎలా?

by  |
అంతరిక్షం నుంచి ఓటింగ్ ఎలా?
X

దిశ, వెబ్‌డెస్క్:

ఓటు వేయడమనేది పౌరుని బాధ్యత. అది ఇండియా అయినా, అమెరికా అయినా.. ప్రతి పౌరునికి తమ ఓటుహక్కుని వినియోగించుకోవడం అనేది ఓ సామాజిక బాధ్యత. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జోయి బిడెన్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి అమెరికన్ ఓటు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భూమ్మీద ఉన్న అమెరికా సిటిజన్ల పరిస్థితి సరే.. మరి అంతరిక్షంలో ఉన్న అమెరికా సిటిజన్ల పరిస్థితి ఏంటి? వారి ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు? దాని గురించి తెలియాలంటే ఇది చదవాల్సిందే!

ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వ్యోమగాములకు అమెరికన్ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లను కల్పించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం, హ్యారిస్ కౌంటీ క్లార్క్ కార్యాలయం వారు సురక్షితమైన ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌ను జాన్సన్ స్పేస్ సెంటర్‌కు అప్‌లోడ్ చేస్తుంది, వారికి ఇచ్చిన నిర్దిష్ట క్రెడెన్షియల్స్‌తో ఈ సురక్షితమైన లింక్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 2016లో నాసా వ్యోమగామి షేన్ కిమ్‌బరో ఆయన ఓటు హక్కును అంతరిక్షం నుంచే వినియోగించుకున్నారు. ఈ విధంగా అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి అమెరికన్ వ్యోమగామిగా డేవిడ్ వోల్ఫ్ రికార్డు సృష్టించారు.


Next Story