భారత్‌తో చర్చలు ప్రారంభించండి.. పాక్ ప్రధానికి కీలక రిక్వెస్ట్

by Dishanational4 |
భారత్‌తో చర్చలు ప్రారంభించండి.. పాక్ ప్రధానికి కీలక రిక్వెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సంక్షోభంతో అతలాకుతలమైంది. అక్కడ తీవ్ర ఆహార సంక్షోభం కూడా నెలకొంది. ఈనేపథ్యంలో పాక్ వ్యాపారులు ఓ కీలకమైన అంశాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ ఎదుట లేవనెత్తారు. షెహబాజ్‌తో ఇంటరాక్టివ్ సెషన్‌ జరుగుతుండగా పాకిస్తాన్ వ్యాపార సంఘం నాయకులు భారత్‌తో సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనకు సూచించారు. బుధవారం పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలోని సింధ్ సీఎం హౌస్‌‌లో జరిగిన సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. కఠినమైన ప్రశ్నలను సంధించిన కరాచీ వ్యాపార సంఘం.. దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి షెహబాజ్ ప్రదర్శిస్తున్న సంకల్పాన్ని ప్రశంసించింది. భారతదేశంతో వాణిజ్య చర్చలను ప్రారంభించాలని ఆయనను కోరింది. తద్వారా పాక్ ఆర్థిక సంక్షోభం సమసిపోయేందుకు బాటలు పడతాయని కరాచీ వ్యాపార సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.



Next Story

Most Viewed