ఏనుగుతో హీరో అనుబంధం.. వీడియో వైరల్

by  |
ఏనుగుతో హీరో అనుబంధం.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. తమిళ్‌లో ‘కాదన్‌’గా తెరకెక్కిన సినిమాలో ఏనుగు(ఉన్ని) కీలక పాత్రలో కనిపించబోతోంది. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ మరో లీడ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రంలో ఉన్నికి, తనకు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో వీడియో ద్వారా షేర్ చేశాడు. ‘షూటింగ్ రెండో రోజున ఉన్ని నవ్వుతున్న ముఖంతో తనను యాక్సెప్ట్ చేసింది, తన మీదకు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి’ అంటూ పోస్ట్ పెట్టాడు విష్ణు. తను బెల్లం లడ్డు ఇవ్వగానే ఏనుగు సంతోషంగా తీసుకున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుగుకు విష్ణు విశాల్‌కు మధ్య అడోరబుల్ బాండింగ్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అరణ్య’ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకులు కాగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుమతితో ‘ఉన్ని’ని చిత్రీకరణ కోసం తీసుకొచ్చారు. కాగా ప్రభు సాల్మన్ గతంలో ‘కుంకి’ చిత్రంలోనూ ఇదే ఏనుగును వినియోగించారు. ప్రస్తుతం ఇదే సినిమా హిందీలో ‘హాతి మేరి సాతి’గా రిలీజ్ కానుండగా.. విష్ణు విశాల్ పాత్రలో పుల్కిత్ సామ్రాట్ నటించారు.

Next Story