మంచం పట్టిన పెనుగోలు గ్రామం

by Shyam |

<p>దిశ, వాజేడు: అది ఒక గిరిజన గ్రామం. ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని వాజేడు మండల కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామం. ఆ గ్రామం వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేక కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. మూడు వాగులు.. మూడు గుట్టలు దాటి దాటి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యం ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ పెనుగోలు [&hellip;]</p>

మంచం పట్టిన పెనుగోలు గ్రామం
X

దిశ, వాజేడు: అది ఒక గిరిజన గ్రామం. ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని వాజేడు మండల కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామం. ఆ గ్రామం వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేక కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. మూడు వాగులు.. మూడు గుట్టలు దాటి దాటి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యం ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ పెనుగోలు గ్రామంలో గిరిజనులు విషజ్వరాల బారిన పడి గత కొద్ది రోజులుగా మంచాన పడ్డారు.

పెనుగోలు గ్రామ గిరిజనులు జ్వరాల బారిన పడిన విషయం అధికారులకు తెలియజేసినప్పటికీ.. ఎవరు స్పందించకపోవడంతో ప్రభుత్వ వైద్యం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక శేషయ్య దివ్యభారతి దంపతులకు చెందిన శివ కుమార్, అభిరామ్, రాకేష్ అనే ముగ్గురు పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. గత కొద్దిరోజుల నుండి జ్వరంతో బాధపడుతూ ఎలాంటి వైద్యం అందకపోవడంతో నాటు వైద్యం పైనే ఆధారపడ్డానరు. రాకేష్ (3)ఆరోగ్యం విషమంగా మారగా.. సోమవారం వైద్యం కోసం వాజేడు మండల కేంద్రంలోని 16 కిలోమీటర్లు కాలినడకన నడిచి వైద్యశాలకు చేరుకున్నారు. అక్కడి వైద్యులు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేశారు.

వైద్యశాల ఎదుట వైద్యం కోసం గంటపాటు నిరీక్షించినా.. వైద్యులు వైద్యం అందించకపోవడంతో బాలుడు మృతి చెందినట్లు బాలుడు తల్లి దివ్యభారతి తెలిపారు. మరో ఇద్దరు పిల్లలు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. మృతి చెందిన బాలుడిని పెనుగొలు గ్రామం తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో పగల పల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటివద్ద బాలుడి శవాన్ని పెట్టుకొని పడిగాపులు కాస్తున్నారు. పెనుగోలు గ్రామంలో పదిహేను కుటుంబాలకు పైగా విష జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యం అందక నాటు వైద్యంపైనే ఆధారపడి గిరిజనులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జ్వరం బారినపడి బాలుడు మృతిచెందడంతో.. తెలుగుల గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి జ్వరంతో బాధపడుతున్న పెనుగోలు గిరిజనులకు వైద్యం అందే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు.

Next Story