- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా ఇంతటితో ఆగదు: బ్రహ్మనాయుడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: వినుకొండలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇది ఇంతటితో ఆగదని స్థానిక ఎమ్మెల్యే బొళ్ళ బ్రహ్మనాయుడు అన్నారు. రోజు రోజుకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ముంపు పొంచే ఉందని హెచ్చరించారు. వినుకొండ పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సోమవారం అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దుకాణా దారులు, వ్యాపారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసర ప్రయాణాలు […]</p>

X
దిశ, అమరావతి: వినుకొండలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇది ఇంతటితో ఆగదని స్థానిక ఎమ్మెల్యే బొళ్ళ బ్రహ్మనాయుడు అన్నారు. రోజు రోజుకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ముంపు పొంచే ఉందని హెచ్చరించారు. వినుకొండ పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సోమవారం అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దుకాణా దారులు, వ్యాపారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసర ప్రయాణాలు ఎవరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బయటకు వచ్చి కరోనా వ్యాప్తికి సహకరిస్తే వినుకొండను రెడ్ జోన్ గా ప్రకటించి పూర్తి లాక్ డౌన్ ప్రకటించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Next Story






