విద్యుత్ సంక్షోభం… వినోద్ కుమార్ సంచలన ఆదేశం

by  |
coal mine
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొన్ని నెలల్లో దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు, గనులు అధికంగా ఉన్నా.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతున్న వేళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో భూపాలపల్లి నుంచి బొగ్గును తరలించవద్దని వినోద్‌ కోరారు. భూపాలపల్లిలో విద్యుదుత్పత్తి కోసమే తాడిచర్ల బొగ్గును వాడాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని ఆదేశాలు ఇవ్వాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలోని బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించకుండా ఉండేందుకు రాష్ట్రం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed