లోక్‌సభ ఎన్నికల రెండు దశల్లో మహిళా అభ్యర్థులు కేవలం 8% మాత్రమే

by Disha Web Desk 17 |
లోక్‌సభ ఎన్నికల రెండు దశల్లో మహిళా అభ్యర్థులు కేవలం 8% మాత్రమే
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి రెండు దశల్లో మొత్తం 1,618 మంది అభ్యర్థులలో మహిళలు కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉండగా, దీనిపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది లింగ పక్షపాతానికి సంబంధించిన లోతైన సమస్యను ప్రతిబింబిస్తుందని, మహిళల సాధికారతకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 135 మంది మహిళా అభ్యర్థులు ఉండగా, రెండో దశలో 100 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు, మొత్తంగా, రెండు దశల్లో కలిపి 235 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొదటి దశలో 135 మంది మహిళా అభ్యర్థులలో, తమిళనాడులో అత్యధికంగా 76 మంది, కేరళలో రెండో దశలో అత్యధికంగా 24 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పార్టీల వారీగా కాంగ్రెస్ ఇప్పటి వరకు 44 మంది మహిళలను బరిలోకి దించగా, బీజేపీ నుంచి 69 మంది మహిళలు ఉన్నారు. రాజకీయ పార్టీలు మహిళల అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారత్‌ ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నందున, అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అభ్యర్థిత్వానికి అడ్డుగా ఉన్న అన్ని అంశాలను తొలగించి రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాలు అందించాలని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ సూచించారు. రాజకీయ పార్టీలు మహిళల చేరికకు ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి తగిన మద్దతును అందించాలని ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం పార్టీలు ఎదురుచూడటం బదులుగా ముందుగానే వారికి టిక్కెట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed