గంగుబాయిపై ట్రోల్స్.. తప్పులేదంటున్న ఆలియా బావ

by  |
గంగుబాయిపై ట్రోల్స్.. తప్పులేదంటున్న ఆలియా బావ
X

దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్‌పై ట్రోల్స్ ఎదుర్కోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హుస్సేన్ జైద్ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆలియా టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురుకాగా దీనిపై తన ఒపీనియన్ షేర్ చేశాడు విక్రమ్ భట్.

నటుల జీవితంలో ఇదొక భాగమని అభిప్రాయపడ్డాడు. ఎంటర్‌టైనర్ స్ట్రాంగ్‌గా ఉండాలని.. ఆడియన్స్ కుళ్లిన టమోటాలు, చెప్పులు విసిరినా లేక పూల వర్షం కురిపించినా.. రెండింటికి సిద్ధంగా ఉండాలని సూచించాడు. కీర్తిని కోరుకున్నప్పుడు.. ప్రజల నుంచి ప్రేమను కావాలనుకున్నప్పుడు.. అదే సమయంలో తమను ద్వేషించే వారు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలన్నాడు. ఇలాంటి వ్యక్తులు లేకపోతే సినిమాలు ఎవరు చూస్తారన్న ఆయన.. మీ నటనను ఎప్పుడూ విమర్శించే ప్రేక్షకులు నచ్చినప్పుడు ప్రశంసిస్తారన్న విషయంలో సందేహం లేదన్నాడు.

Next Story

Most Viewed