ఈటల బీజేపీ ఎంట్రీపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం తీసుకున్నారు&#8230; పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. మంగళవారం ట్విట్టర్ లో అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే సాధ్యమన్నారు. తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం దిశగా వెళుతున్నందుకు అభినందనలు. టీఆరెస్‌ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా, సామర్థ్యం బీజేపీకి మాత్రమే [&hellip;]</p>

ఈటల బీజేపీ ఎంట్రీపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం తీసుకున్నారు… పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. మంగళవారం ట్విట్టర్ లో అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే సాధ్యమన్నారు.

టీఆర్ఎస్ ను ఎదరించి నిలిచి, గెలిచే సత్తా, సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయనేది తిరుగులేని వాస్తవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వెళ్లిపోతారనే భావన తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే ఉందన్నారు. అది వాస్తవం కాదని..ఇప్పటికే నిరూపితమైందన్నారు. కానీ టీఆర్ఎస్ తోనే అభివృద్ధి జరుగదన్నారు. రాబోయేది బీజేపీయేనని తెలిపారు. ప్రజలు కూడా బీజేపీవైపు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Next Story