ఇకపై అలా చేయను.. క్షమించండి : సేతుపతి

by  |
ఇకపై అలా చేయను.. క్షమించండి : సేతుపతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజున ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సెలెబ్రిటీల విషెస్‌తో సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండ్ కాగా.. తను మాత్రం క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశాడు. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేశాడు.

విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి పొన్రం డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇదే సెట్‌లో యూనిట్ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు సేతుపతి. అయితే మూవీ యూనిట్ కోరిక మేరకు పెద్ద కత్తితో కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన మీద ట్రోల్స్ మొదలయ్యాయి. బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడని విమర్శలు వచ్చాయి.
ఇంతకు ముందు ఇలా కత్తితో కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటే చెన్నై పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అదే విధంగా తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

https://twitter.com/VijaySethuOffl/status/1350329792457895937?s=19

దీంతో క్షమాపణలు చెప్తూ నోట్ రిలీజ్ చేశాడు విజయ్ సేతుపతి. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేస్తూ.. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చాడు. పొన్రం దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కత్తి కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే అలా కత్తితో కేక్ కట్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

కాగా సేతుపతి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ నుంచి ఉప్పెన, రేడియో మాధవ్ మూవీ యూనిట్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి.

Next Story

Most Viewed